Saturday, January 18, 2025
Homeసినిమామాఫియా డాన్ గా ప్రభాస్? 

మాఫియా డాన్ గా ప్రభాస్? 

ప్రభాస్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన ‘కల్కి’ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను రాబడుతూ దూసుకుపోతోంది. ఆ తరువాత ప్రభాస్ నుంచి ‘రాజా సాబ్’ .. ‘సలార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘సలార్ 1’ ప్రేక్షకుల ముందుకు రావడం వలన, ఆ సినిమాలో ఆయన పాత్ర గురించి అందరికీ తెలుసు. ఇక ‘రాజాసాబ్’ విషయానికి వస్తే, ఆల్రెడీ ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్లు వదలడం వలన, ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడనేది కూడా ఆడియన్స్ కి తెలుసు. ఇక మిగిలినదల్లా ‘స్పిరిట్’ సినిమానే.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ రూపొందనుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారనే టాక్ ఉంది. ఇంకో 20 శాతం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే మిగిలి ఉందనే ప్రచారం జరుగుతోంది. సందీప్ తన సినిమాల్లో హీరోలను ఎలా చూపిస్తాడు? ఆయన తయారు చేసుకునే కథలు ఎలా ఉంటాయనే విషయంలో ప్రేక్షకులకు ఒక అంచనా ఉంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేనున్నాడనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.

‘స్పిరిట్’ కూడా పాన్ ఇండియా సినిమానే. అందువలన ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే విషయంతో ప్రేక్షకులు ఆత్రుతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతూ, ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఒక పాత్రలో ఆయన మాఫియా డాన్ గా రాయల్ గా కనిపిస్తాడనీ, మరో పాత్రలో మాస్ లుక్ తోను కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఈ రెండు పాత్రలకు జోడీగా ఎవరు కనిపిస్తారనే ఆసక్తిని రేపుతున్న అంశం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్