Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ సరసన దీపికా పడుకొనే

ప్రభాస్ సరసన దీపికా పడుకొనే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్‌ ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. ఈ రోజు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకువచ్చారు. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్ కూడా ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ రోజు నుంచి ఆగష్టు 2 వరకు షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పడుకొనే నటిస్తున్నారు.

ముందుగా అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ భారీ పిరియాడిక్ లవ్ స్టోరీని జులై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. ఈ సంవత్సరం చివరిలో ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానుందని సమాచారం.

ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్’ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రం 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మొదలైంది. స్టార్ హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేయడమే కష్టం అనుకుంటున్న టైమ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తుండడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్