Saturday, January 18, 2025
HomeసినిమాPrabhas Dual Role: ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

Prabhas Dual Role: ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడు ప్రకటిస్తారంటే.. సమయం వచ్చినప్పుడు మంచి రోజు చూసి ప్రకటిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదినేత విశ్వప్రసాద్ ఇటీవల తెలియచేశారు. ఇటీవల ఈ సినిమా కోసం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమాకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ కు ఓ వీక్ నెస్ ఉంటుందట. ఆ వీక్ నెస్ ఆధారంగా వచ్చే సీక్వెన్స్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇందులో చాలా ఎంటర్ టైన్మెంట్ సీన్స్ రాశాడట మారుతి. అసలు మారుతితో ప్రభాస్ సినిమా ఏంటి అనే విమర్శలు వచ్చాయి. అయితే.. ఆ విమర్శలను ఛాలెంజ్ గా తీసుకుని మారుతి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడట.

ఇక టైటిల్ విషయానికి వస్తే.. రాయల్, రాజా డీలక్స్, అంబాసిడర్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా టాక్ వచ్చింది కానీ.. ఇప్పుడు మాత్రం రాయల్ అనే టైటిల్ ఖరారు చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని టాక్. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను కల్కి సినిమా రిలీజ్ తర్వాత ప్రకటిస్తారట. కల్కి చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తన్నారు. సో.. ప్రభాస్, మారుతి మూవీని సమ్మర్ తర్వాత అనౌన్స్ చేస్తారు. నెక్ట్స్ ఇయర్ దసరాకి ఈ మూవీ థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్