Saturday, January 18, 2025
Homeసినిమాఘనంగా జరిగిన 'కల్కి' ఈవెంట్ .. సందడి చేసిన ప్రభాస్!

ఘనంగా జరిగిన ‘కల్కి’ ఈవెంట్ .. సందడి చేసిన ప్రభాస్!

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు ‘కల్కి 2898 AD’ కోసం ఎదురుచూస్తున్నారు. అటు వైజయంతీ మూవీస్ బ్యానర్ లోను .. ఇటు ప్రభాస్ కెరియర్ లోను భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. సైన్స్  ఫిక్షన్ కి ఇతిహాసాన్ని జోడిస్తూ వెళ్లిన కథ ఇది. ప్రభాస్ పూర్తి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అమితాబ్ .. కమల్ .. దీపికా పదుకొణె .. దిశా పటాని కీలమైన పాత్రలను పోషించారు. జూన్ 27వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. అందులో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక వేడుకను నిర్వహించారు. ఈ సినిమాలో ‘భైరవ’ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఆయన ఉపయోగించే వాహనం పేరు ‘బుజ్జి’. ఈ వాహనంపైనే ప్రభాస్  స్టేజ్ పైకి రావడం అభిమానులను అలరించింది. ఈ రెండు పాత్రలను పరిచయం చేస్తూ ఒక టీజర్ ను ప్రదర్శించారు. ‘ఇంకా తిరిగి వెళ్లేదే లేదు’ అంటూ ప్రభాస్ చేసిన సందడి ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ .. “అమితాబ్ గారు .. కమల్ గారు ఇద్దరూ కూడా భారతీయులు గర్వించదగిన నటులు. ఎంతోమంది వారి స్ఫూర్తితోనే ఇక్కడికి వచ్చారు. అలాంటివారిలో నేను కూడా ఒకడిని. అటువంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారి సినిమాలను చూస్తూ పెరిగిన నేను, వారితో కలిసి నటించినందుకు గర్వపడుతున్నాను. ఇక దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారనేది తెరపై కనిపిస్తుంది. నా అభిమానులతో పాటు నేను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని చెప్పాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్