Sunday, January 19, 2025
Homeసినిమావిక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ‘రాధేశ్యామ్’

విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ‘రాధేశ్యామ్’

periodic love story: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన‌ భారీ పీరియాడిక్ మూవీ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించింది. యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌డం విశేషం.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే ‘అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవు’ అని చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రేమ పెళ్లి అనే వాటికి తావు లేకుండా కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి ప్రేర‌ణ  ప్ర‌వేశిస్తుంది. ‘నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు’ అంటూ ఆమెను ముద్దుల వరకూ తీసుకొచ్చాడు. అదే సమయంలో ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ ను పరిచయం చేశారు.

విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథలో జ్యోతిష్యం, సైన్స్ లు కీలక పాత్ర పోషించబోతున్నట్లు అర్థం అవుతోంది. ట్రైన్, షిప్ మునిగిపోవడం.. భూకంపం రావడంతో వీరి జీవితం ఎలా మ‌లుపు తిరిగింది.?  చివ‌రికి వీరి ప్రేమ‌క‌థ ఏమైంది..? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిని బ‌ట్టి వినూత్న పీరియాడిక్ ల‌వ్ స్టోరీని తెర పై ఆవిష్క‌రించార‌నేది అర్ధం అవుతుంది. ఈ ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌చ్చు. మ‌రి.. సంక్రాంతికి వ‌స్తున్న రాధేశ్యామ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘పరమహంస’గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్