Sunday, January 19, 2025
Homeసినిమా'రాజా సాబ్' నుంచి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ లుక్!

‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ లుక్!

ప్రభాస్ నుంచి ఇటీవల వచ్చిన ‘సలార్’ సినిమా, ఆయన అభిమానులను ఖుషీ చేసింది. చాలా కాలంగా ప్రభాస్ ను మాస్ యాక్షన్ జోనర్లో చూడాలనుకుంటున్న అభిమానులు, ఈ సినిమాతో సంతృప్తి చెందారు. ‘సలార్’ తరువాత ‘కల్కి’ వచ్చేవరకూ వెయిట్ చేయవలసిందే అని అంతా అనుకున్నారు. కానీ అంతకంటే ముందుగానే ప్రేక్షకులను పలకరించేలా ప్రభాస్ మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ బయటికి రాకుండా చూసుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది. అందుకు తగినట్టుగానే ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. నైట్ లో .. స్ట్రీట్ లో లుంగీ కట్టుతో ప్రభాస్ మంచి జోరుమీద నడిచి వస్తున్న ఈ లుక్ ఆయన అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయి రిలీజ్ కావడంతో, అన్ని భాషల్లోను ఒకే టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘రాజా సాబ్’ అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ .. మాళవిక మోహనన్ .. రిద్ధి కుమార్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్