Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ న‌డ‌వ‌లేక‌పోతున్నాడా ఏమైంది..?

ప్ర‌భాస్ న‌డ‌వ‌లేక‌పోతున్నాడా ఏమైంది..?

ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’.  ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయోధ్య‌లో గ్రాండ్ గా జ‌రిగిన ఈవెంట్ లో టీజ‌ర్ రిలీజ్ చేశారు. అయితే… టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ ర్యాంప్ పై కాస్త అసౌకర్యంగా నడవడం ఫ్యాన్స్ ఆందోళన చెందేలా చేసింది. హాఫ్ ఫీట్ హైట్ కూడా లేని స్టెప్స్ దిగడానికి కృతి సనన్ – ఓం రౌత్ సహాయం తీసుకున్నారెందుకు అని అందరూ ఆలోచించారు.

ప్ర‌భాస్ ఆ మధ్య స్పెయిన్ వెళ్లి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకున్న ప్రభాస్.. కొన్ని రోజులు అన్ని సినిమాల షూటింగులను పక్కన పెట్టేసాడు. ఇటీవల తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ప్రభాస్ ‘సలార్’ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ స్టూడియోలో జరిగిన ఈ షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని ఆన్ లోకేషన్ పిక్స్ నెట్టింట హల్ చల్ చేశాయి.

ప్ర‌భాస్ గాయం నుంచి కోలుకుని.. ఎప్పటిలాగే చిత్రీకరణలో పాల్గొన్నారని అందరూ అనుకున్నారు కానీ.. ఇప్పుడు ‘ఆది పురుష్’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ కాస్త ఇబ్బందిగా నడవడం చూసి అభిమానులు కంగారు పడ్డారు. అయితే చికిత్స అనంతరం రెస్ట్ తీసుకున్నప్పటికీ.. అది పూర్తిగా సెట్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ లో పాల్గొనాలని.. తగినంత విశ్రాంతి తీసుకోవాలని ప్ర‌భాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న‌ఆదిపురుష్ టీజ‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్