Sunday, January 19, 2025
Homeసినిమా'సలార్' మరో సంచలనం సృష్టించనుందా?

‘సలార్’ మరో సంచలనం సృష్టించనుందా?

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు ‘సలార్’ సినిమాపైనే దృష్టిపెట్టారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ఫస్టు పార్టు థియేటర్స్ కి రానుంది. దాంతో ఆ తేదీ ఎంత త్వరగా వస్తుందా అనే ఆతృతను అభిమానులు కనబరుస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన ‘కేజీఎఫ్’ .. ‘కేజీఎఫ్ 2’ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. దాంతో ప్రభాస్ సినిమా కూడా మరో సంచలనాన్ని సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

ప్రభాస్ కెరియర్లో భారీ బడ్జెట్ లో రూపొందిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా వాటి ఎఫెక్ట్ ఈ సినిమా బిజినెస్ పై కనిపించడం లేదు. అలాగే ఆడియన్స్ లో ఆయన సినిమాపై ఆసక్తి కూడా తగ్గలేదు. రోజు రోజుకీ ఈ సినిమాపై బజ్ పెరిగిపోతూనే వస్తోంది. ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ప్రభాస్ మాస్ హీరోగా ఈ సినిమాలో కనిపించనుండటం విశేషం.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘కేజీఎఫ్’ బంగారు గనుల నేపథ్యంలో వస్తే, ‘సలార్’ బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందింది. పాన్ ఇండియా రేంజ్ సినిమా కావడం వలన ఆ అటు నార్త్ .. ఇటు సౌత్ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓపెనింగ్స్ రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవలసిన అవసరం ప్రభాస్ కి ఉంది కూడా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్