Sunday, January 19, 2025
Homeసినిమామరింత లేటుగా మారుతూ-ప్రభాస్ మూవీ

మరింత లేటుగా మారుతూ-ప్రభాస్ మూవీ

Delay: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో స్పిరిట్ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే.. ఈ సినిమాల మ‌ధ్య‌లో మారుతి డైరెక్ష‌న్ లో ఓ చిన్న సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు ప్ర‌భాస్.

ఈ ప్రాజెక్ట్ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియ‌ల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో అస‌లు ఈ ప్రాజెక్ట్ ఉందా..?  లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది. తాజా అప్ డేట్ ఏంటంటే.. స‌లార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లు ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర్వాత మారుతితో సినిమాను ప్రారంభించాలి అని ఫిక్స్ అయ్యార‌ట‌. ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందే ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : స‌లార్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్న ప్ర‌శాంత్ నీల్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్