Thursday, March 19, 2026
Homeసినిమాప్ర‌భాస్, మారుతి సినిమా పేరు 'రాజ డీలక్స్'?

ప్ర‌భాస్, మారుతి సినిమా పేరు ‘రాజ డీలక్స్’?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, యంగ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్‌లలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. హార్ర‌ర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమా కోసం ప్రభాస్ 50 రోజులు కేటాయించాడు. మేలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రాజా డీల‌క్స్ ‘ నే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

తాజా అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాకి  సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ ని ఎంపిక చేశార‌ని తెలిసింది. ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక రాజా డీలక్స్ లో మాళవిక మోహనన్, శ్రీ లీలలను హీరోయిన్స్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని, అందుకోసం కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మూడవ హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular