Saturday, January 18, 2025
Homeసినిమావిజువల్ ఫీస్టును అందించనున్న 'రాజా సాబ్'

విజువల్ ఫీస్టును అందించనున్న ‘రాజా సాబ్’

ప్రభాస్ చాలా కాలంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. వందల కోట్ల బడ్జెట్ .. వేలకోట్ల వసూళ్లు అన్నట్టుగా ఆయన కెరియర్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. అయితే ఒక్క సినిమా మాత్రం ఒక మాదిరి బడ్జెట్ తో నిర్మిత మవుతోంది .. ఆ సినిమానే ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రభాస్ కి ఒక మాదిరి బడ్జెట్ కథలను చెప్పడానికి దర్శకులు టెన్షన్ పడుతున్న సమయంలో మారుతి ఈ సాహసం చేశాడు .. సక్సెస్ అయ్యాడు.

మారుతి ఇంతవరకూ ఓ మాదిరి బడ్జెట్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. వెంకటేశ్ మినహా ఆయన సీనియర్ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేదు. అలాంటి మారుతి .. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ కి కథ చెప్పి ఓకే చేయించుకుంటాడని ఎవరూ అనుకోలేదు. పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫాస్టు ఫార్వార్డ్ లో వెళుతున్న ప్రభాస్ కూడా, హఠాత్తుగా మారుతి కథ వినేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని కూడా ఎవరూ గెస్ చేయలేదు. అలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెట్టయిన ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం షూటింగు దశలో ఈ సినిమా ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో కాస్త రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. అలాగే మారుతి మార్క్ కామెడీ టచ్ ఉంటుంది. ఇక హారర్ కోణం ఉందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తున్నదే. అయితే హారర్ కోణాన్ని లైట్ గా కాకుండా కాస్త హెవీగానే చూపించనున్నారని చెబుతున్నారు. అందుకు అవసరమైన గ్రాఫిక్స్ ను గట్టిగానే చేయిస్తున్నారట. మారుతికి యానిమేషన్ పై మంచి పట్టు ఉంది. కాకపోతే ఇంతవరకూ దానిని ఉపయోగించుకునే అవకాశం రాలేదంతే. ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ ఒక రేంజ్ లో ఉంటాయనీ, విజువల్స్ గొప్పగా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్