Saturday, January 18, 2025
Homeసినిమామే 22న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ !

మే 22న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వనీదత్ సమర్పణలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ షూటింగ్ చివరిదశలో ఉంది. మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి  దాదాపు రూ. 700కోట్ల భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్థామ‌గా  ఓ కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకొనే హీరోయిన్‌ గా న‌టిస్తుండ‌గా, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నారు. దిశా ప‌టానీ మరో కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.

అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటికి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 22న  గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించనున్నారని సమాచారం .హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవాకాశం ఉంది. ఈ మూవీ 2024 జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా  విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్