Monday, March 9, 2026
Homeసినిమాప్రభాస్ కి ఇప్పుడు కావలసింది గైడెన్స్!

ప్రభాస్ కి ఇప్పుడు కావలసింది గైడెన్స్!

ప్రభాస్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది .. అందుకు తగిన మార్కెట్ ఉంది. వందల కోట్ల బడ్జెట్ .. వేలకోట్ల బిజినెస్. బాలీవుడ్ హీరోలను సవాల్ చేస్తున్న ఆయన ఫాలోయింగ్. ఇలా ప్రభాస్ కి అన్నీ ఉన్నాయి … మరి లేనిదేమిటి? అంటే సరైన గైడెన్స్ అనే చెప్పుకోవాలి. అదే గనుక ఉండి ఉంటే ఈ రోజున ‘ఆదిపురుష్’ విషయంలో ఇన్ని అభ్యంతరాలు .. ఇన్ని విమర్శలు  వ్యక్తమై ఉండేవి కావేమో. అందువలన తన ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు? ఏం తీస్తున్నారు? అనేది ఎప్పటికప్పుడు ప్రభాస్ కి చెప్పేవారు కావాలి.

ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు మంచి గైడెన్స్ ఉంది. కథాకథనాలను వాళ్లే ఫిల్టర్ చేసి, డైరెక్టర్ చేతిలో ఫైనల్ స్క్రిప్ట్ పెట్టేసి ఇక సెట్స్ కి వెళ్లండి అని చెప్పేస్తారు. అలా కథలు వినేసి ఏది చేయాలి? ఏది ఒప్పుకోకూడదు? అనేది ప్రభాస్ కి చెప్పేవారు కావాలనేది ఆయన అభిమానుల మాట. ఒక స్టార్ స్టేటస్ వచ్చిన తరువాత చుట్టూ కొంతమంది చేరతారు. అలాంటివారి వలన ఏది చేయాలి? ఏది మానుకోవాలి? అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో ఒక అయోమయం ఏర్పడుతుంది. ఆ సమయంలో గైడ్ చేసేవారు కావాలి.

మెగాస్టార్ వంటివారు స్క్రిప్ట్ విషయంలో తనకి ఏమైనా సందేహాలు ఉంటే సత్యానంద్ కి గానీ .. పరుచూరి బ్రదర్స్ కి గాని పంపించి వాళ్ల అభిప్రాయాన్ని అడిగేవారని అంటారు. అలాగే ప్రభాస్ తాను చేసే ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్టులను రాజమౌళి .. త్రివిక్రమ్ వంటివారికి పంపించి ఒకసారి చూడమనొచ్చు. ప్రభాస్ మంచి మనిషి .. మనసున్న మనిషి .. తన స్టార్ డమ్ ను ఎంతమాత్రం పట్టించుకోని మనిషి. ఆయన ఎంత మొహమాటస్తుడో తెలిసిందే. అందువలన ఆయన క్రేజ్ ను నిలబెట్టడానికి అవసరమైన ప్రాజెక్టులు పడాలంటే, ఆయనకి ఇప్పుడు గైడెన్స్ అవసరమనేది అభిమానుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular