Thursday, April 17, 2025
Homeసినిమాఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

Prabhas donation:
సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేశారు. తాజాగా మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సహాయ పునారావాస కార్యక్రమాలతో సాయం చేస్తోంది. మరో వైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు.

ప్రభాస్ కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు యంగ్ రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్