Sunday, January 19, 2025
Homeసినిమారెండు పార్టులుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే'..?

రెండు పార్టులుగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’..?

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కమల్ హాసన్ కూడా నటిస్తుండడంతో ప్రాజెక్ట్ కే సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. సమ్మర్ లో ఈ సినిమా విడుదల అని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే… బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ చిత్రాలు రెండు పార్టులుగా వచ్చాయి. ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యింది. సలార్ సినిమాని సైతం రెండు పార్టులుగా చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే చిత్రాన్ని కూడా రెండు పార్టులుగా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్త‌య్యింది. ఈ సినిమాలో పార్ట్ 1 ముగింపులో.. క‌మ‌ల్ పాత్ర ఎంట్రీ ఇస్తుంద‌ని, ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌తోనే తొలి పార్ట్ కి ముగింపు ప‌డుతుంద‌ని స‌మాచారం.

ప్రాజెక్ట్ కే పార్ట్ 2లో క‌మ‌ల్ పాత్ర పూర్తి స్థాయిలో క‌నిపిస్తుంద‌ట‌. క‌మ‌ల్ తో పాటు… క‌న్న‌డ‌, మ‌ల‌యాళ అగ్ర న‌టులు సైతం పార్ట్ 2లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె రెండో భాగాన్ని 2025 సంక్రాంతికి విడుద‌ల చేయాలి అనుకుంటున్నారట. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యిందని ప్రచారం పై క్లారిటీ రావాల్సివుంది. ఏది ఏమైనా ప్రాజెక్ట్ కే మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్