Prabhas-Sweety: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. అయితే.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తోన్న ప్రభాస్ యంగ్ డైరెక్టర్ మారుతితో కూడా ఓ సినిమా చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ బటయకు వచ్చింది.
అయితే.. ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఇద్దరు ఫిక్స్ అయ్యారు. మూడో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని ప్రచారం జరిగింది. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా అనుష్కను ఫైనల్ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో ప్రభాస్, అనుష్క కలిసి నటించారు. ఆ సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈజంట తెరపై కనిపిస్తే.. అభిమానులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
Also Read : రాధేశ్యామ్ ఆల్ టైమ్ రికార్డ్