Sunday, January 19, 2025
Homeసినిమామ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్ర‌భాస్

మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్ర‌భాస్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నారు. ‘ఆదిపురుష్’  షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది.  దీనితో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సలార్’ లో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ ‘ప్రాజెక్ట్ కే’ కూడా నిర్మాణంలో ఉంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా  ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు  మూవీ 50 శాతం పూర్తయినట్టుగా మేకర్స్ తెలిపారు.

ఇదిలా వుంటే తాజాగా ప్రభాస్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్నారని స‌మాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీని వచ్చే సంవ‌త్స‌రం జూన్ కి సెట్స్ పైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని వివరాల్ని బాలీవుడ్ మేకర్స్ వెల్లడించే అవకాశం వుందని స‌మాచారం. అయితే.. ఈ క్రేజీ, భారీ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తారు?  ఏ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది..? అనేది తెలియాల్సివుంది.

Also Readప్ర‌భాస్ నుంచి అడ్వాన్స్ వెనక్కు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్