Sunday, January 19, 2025
Homeసినిమా‘కేజీఎఫ్-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్ర‌భాస్?

‘కేజీఎఫ్-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్ర‌భాస్?

Yash-Prabhas: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘కేజీఎఫ్-2’. పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ‘కేజీఎఫ్-1’ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో కేజీఎఫ్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ, క్రేజీ మూవీని భారీ స్థాయిలో ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది.

దీనిలో భాగంగా ఇటీవల వచ్చిన తుపాన్ తుపాన్.. అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుంది. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ ఈ ఈవెంట్ కు హ‌జ‌రైతే.. కేజీఎఫ్ 2 పై మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లో రానుంద‌ని స‌మాచారం.

Also Read : ‘తుఫాన్’ సృష్టిస్తున్న కెజీఎఫ్‌ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్