Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో దొంగల పాలన - షర్మిల విమర్శ

తెలంగాణలో దొంగల పాలన – షర్మిల విమర్శ

కేసీఅర్ ఎన్నెన్నో మాటలు చెప్పారు.ఒక్క మాట నిలబెట్టుకోలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రుణమాఫీ,సున్నా వడ్డీకి రుణాలు..ఉద్యోగాలు…నిరుద్యోగ భృతి ఇలా అన్ని మోసమే అన్నారు. వైఎస్ షర్మిల  ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటితో 1900km మైలు రాయి దాటింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం ఉప్పనుంతల మండల కేంద్రంలో YSR విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల … కెసిఆర్ పాలనపై దుమ్మెత్తి పోశారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఇప్పటివరకు కనీసం ఒక్కరూ కూడా కేసీఅర్ పథకాలతో లబ్ది పొందామని చెప్పలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఅర్ కి కేవలం ఓట్ల తోనే పని అని… ఓట్లు ఉంటేనే బయటకు వస్తారు.. అవసరం తీరిన తర్వాత ఫామ్ హౌజ్ కే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ఇచ్చే 30 వేల పథకాలను కెసిఆర్ బంద్ పెట్టారని, 30 వేల పథకాలను బంద్ పెట్టీ రైతు బంధు పేరుతో 5 వేలు ఇవ్వడమే కేసీఅర్ గారడీ అని విమర్శించారు. రైతులను బ్యాంక్ ల వద్ద డీ ఫాల్టర్స్ చేశారని, అప్పుల పాలయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

రైతులు కోటీశ్వరులు అయితే ఎలా ఆత్మహత్యలు చేసుకుంటారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డిగ్రీలు ,పీజీ లు చేసుకుంటున్న పిల్లలు పత్తి పీక పోతున్నారని, కళ్లముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తుంటే కేసీఅర్ సొమ్ము ఎమైనా పోయిందా భర్తీ చేసేందుకు అని మండిపడ్డారు. కేసీఅర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా అన్న వైఎస్ షర్మిల కేసీఅర్ పిల్లలు రాజ్యాలు యేలాలి .. ప్రజల బిడ్డలు మాత్రం కూలి పనికి పోవాల అన్నారు. వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఅర్ అని ఘాటుగా విమర్శించారు. ఇదంత దొంగల పాలన…దోపిడీ పాలన అని 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా..బీడీ బిచ్చం..కల్లు ఉద్దెర అన్నట్టుగా తెలంగాణ పరిస్థితి ఉందన్నారు. దేనికి డబ్బులేదు .ప్రాజెక్ట్ లకు మాత్రం డబ్బులు వస్తాయని, కాంట్రాక్టర్ల తో మాట్లాడుకొని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా కు నీళ్ళు వస్తున్నాయి అంటే వైఎస్ఆర్ చలవేనని, కల్వకుర్తి,భీమా,నెట్టెంపాడు లాంటి భారీ ప్రాజెక్ట్ లు వైఎస్సార్ కట్టారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కేసీఅర్ జన్మకి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చారా అని పేదవాడు ఎలా బ్రతుకుతున్నారు అని పట్టింపు లేదని మండిపడ్డారు. ఈసారి గుర్తు పెట్టుకోండి ..బీజేపీ కాంగ్రెస్ కూడా దొంగ పార్టీలని బీజేపీ,కాంగ్రెస్ వారి కోసమే స్వార్థ రాజకీయాలు చేస్తాయన్నారు. తెలంగాణలో ప్రజల కోసం పోరాడే పార్టీ లేదని, వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల అన్నారు.

Also Read : కెసిఆర్ ఏం చేసినా ఓట్ల కోసమే వైఎస్ షర్మిల ఆరోపణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్