Friday, March 13, 2026
HomeTrending Newsకెసిఆర్ మోసం చేయని వర్గం లేదు - షర్మిల

కెసిఆర్ మోసం చేయని వర్గం లేదు – షర్మిల

కేసీఅర్ మోసం చేయని వర్గం లేదు… మోసపోని కుటుంబం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మాట మీద నిలబడే నాయకుడు కేసీఅర్ కాదన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. 8 ఏళ్లు గా కేసీఅర్ చేస్తుంది పరిపాలన కాదు..మోసం అని షర్మిల విమర్శించారు. కేసీఅర్ ది స్వార్థ రాజకీయం…ఎన్నికలు వస్తేనే కేసీఅర్ బయటకు వస్తాడని ఆరోపించారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కాబట్టి బయటకు వస్తున్నాడన్నారు.

ఇన్ని రోజులు ఇవ్వని పథకాలు ఇప్పుడు అమలు చేస్తా అని కెసిఆర్  చెప్తున్నారని షర్మిల విమర్శించారు. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఅర్ పథకాల పేరుతో స్విచ్ వేస్తాడన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తిరిగి ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోతాడని, 8 ఏళ్లుగా పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మాట మీద నిలబడే న్యాయకత్వం కోసం పార్టీ పెట్టామని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేస్తామని షర్మిల వెల్లడించారు.

Also Read : తెలంగాణలో దొంగల పాలన షర్మిల విమర్శ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular