Sunday, January 19, 2025
Homeసినిమా'నా వెంట పడుతున్న... '  ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

‘నా వెంట పడుతున్న… ‘  ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్. ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను నటుడు ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా  ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాక్షించారు. ఇలాంటి మంచి సినిమాలకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు.

వెంకట్  వందెల మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ… మేము నిర్మించిన చిత్రం ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడి మనసుకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంతో ఇంకో ప్రత్యేకత చెబుతూ ‘దర్శకుడిని, హీరోని, హీరోయిన్ ను తొలి పరిచయం మా సంస్థ నుండి చేయడం సంతోషంగా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్