Monday, March 9, 2026
Homeసినిమాసంక్రాంతి బరిలో ‘హనుమాన్’, రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!

సంక్రాంతి బరిలో ‘హనుమాన్’, రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదిని ఖరారు చేశారు.పాన్ ఇండియా చిత్రాన్ని జనవరి 12, 2024న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా మాసీవ్ CGI వర్క్‌ ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్‌పై నిపుణుల బృందం పని చేస్తోంది. మేకర్స్ రాజీపడకుండా రూపొందిస్తున్నారు. హై-బడ్జెట్ చిత్రాల లాగ్ థియేట్రికల్ రన్‌ కోసం మంచి సీజన్, ఫెర్ఫెక్ట్ విడుదల తేదీ అవసరం. సంక్రాంతి అతిపెద్ద సీజన్. మిగిలిన పనులు కోసం, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడానికి కూడా కావాల్సిన సమయం దొరుకుతుంది. విడుదల తేదీ పోస్టర్‌లో హీరో తేజ సజ్జ చేతిలో హనుమాన్ జెండాతో ఒక కొండపై నుండి మరొక కొండకు దూకడం కనిపిస్తుంది. ఇది హనుమంతుని ఆశీర్వాదంతో సూపర్ పవర్స్ ని కలిగిన అండర్‌డాగ్ ని చూపుతుంది.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular