Friday, November 22, 2024
Homeసినిమాతెలుగులోను అదే జోరు చూపిస్తున్న 'ప్రేమలు'

తెలుగులోను అదే జోరు చూపిస్తున్న ‘ప్రేమలు’

ఈ మధ్య కాలంలో టీనేజ్ లవ్ స్టోరీస్ తెలుగులో పెద్దగా రాలేదనే చెప్పాలి. చిన్న సినిమాలుగా ఈ తరహా కంటెంట్ తో వచ్చిన సినిమాలు థియేటర్ల దగ్గర వీకెండ్ తరువాత నిలబడింది కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మలయాళంలో రూపొందిన ‘ప్రేమలు’ .. అక్కడ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది.  తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అక్కడి థియేటర్లలో గట్టిగానే కుదురుకుంది. చాలా  వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

నస్లేన్  – మమిత బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్కడ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ కావడమే ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమైంది. ప్రేమకథా చిత్రాలలో కంటెంట్ బాగుంటే .. ప్రాంతంతో .. భాషతో సంబంధం లేకుండా ఆడేస్తాయి. అందువల్లనే ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన ఇక్కడి థియేటర్లలో విడుదల చేశారు. నిజానికి హీరో – హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఇక్కడి యూత్ కి అంతగా తెలియదు. అయినా కంటెంట్ పై గల నమ్మకంతో ఇక్కడ రిలీజ్ చేశారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టడం విశేషం.

తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ ఉండటం మరో విశేషమే. ఈ సినిమాకి ఇక్కడ పబ్లిసిటీ .. ప్రమోషన్స్ అంతగా జరగలేదు. మౌత్ టాక్ తోనే ఈ సినిమా థియేటర్లకు జనాలను  రప్పిస్తూ వెళుతోంది. ఈ వారం ఇక్కడ నాలుగు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. అయినా చాలా థియేటర్లలో ఇంకా ‘ప్రేమలు’ సినిమా ప్రదర్శితమవుతూ ఉండటం విశేషం. లవ్ స్టోరీస్ నిలబడాలంటే మనసుకు హత్తుకునే మాటలు .. పాటలు .. సన్నివేశాలు ఉండాలి. ఆ వైపు నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేయడమే ఈ జోరుకి కారణమని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్