Saturday, January 18, 2025
Homeసినిమాయూత్ మనసులు దోచేసే 'ప్రేమలు'

యూత్ మనసులు దోచేసే ‘ప్రేమలు’

థియేటర్స్ కి వచ్చే ఏ సినిమా హిట్ కావాలన్నా, ఆ సినిమాకి యూత్ వైపు నుంచి ఎక్కువ ఓట్లు పడాల్సిందే. లేకపోతే  ఆ సినిమా థియేటర్స్ లో వీకెండ్ వరకూ కూడా నిలబడటం కష్టమవుతుంది. యూత్ ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటుంది. ఫీల్ గుడ్ కంటెంట్ ఉంటే కాసుల వర్షం కురిసినట్టే. అలాంటి కంటెంట్ తో రీసెంట్ గా ఏ సినిమా అయినా వచ్చిందా అంటే, అందరి ఆన్సర్ గా ఒక సినిమా పేరు వినిపిస్తుంది .. ఆ సినిమా పేరే ‘ప్రేమలు’ .. ఇది మలయాళ సినిమా.

సహజంగానే మలయాళ ప్రేక్షకులు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ఎక్కువగా ఇష్టపడతారు. కథ అనేది తమ జీవితాలకు దగ్గరగా ఉండాలనే వాళ్లు భావిస్తారు. అలా ఉన్న కంటెంట్ కి మాత్రమే వాళ్లు కనెక్ట్ అవుతారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమానే ‘ప్రేమలు’. నస్లెన్ – మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన అక్కడ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా తక్కువ రోజులలోనే ఎక్కువ మొత్తాలను రాబట్టింది. అలనాటి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రం నిన్ననే వచ్చింది.

గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథా పరంగా కొంత వరకూ హైదరాబాద్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ కారణంగా ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని భావించారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్ స్టోరీస్ కి ప్రధానంగా కావలసింది ఫీల్ .. మనసుకు పట్టే పాటలు. తెరపై హీరో – హీరోయిన్స్ పాత్రలలో ఎవరికి వారు ఊహించుకునేలా చేయడం. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అన్ని సీన్స్ పెర్ఫెక్ట్ గా అనిపించకపోయినా, అక్కడక్కడా కామెడీని .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యూత్ పల్స్ పట్టేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్