Saturday, January 18, 2025
HomeTrending Newsఆయన పాలన రాష్ట్రానికి శాపం: చంద్రబాబు ధ్వజం

ఆయన పాలన రాష్ట్రానికి శాపం: చంద్రబాబు ధ్వజం

తన మనసంతా పోలవరం ప్రాజెక్టుపైనే ఉంటుందని, గతంలో 31 సార్లు ఇక్కడకు వచ్చానని, నేడు 32వ సారి వస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పూర్తి చేశామని… కానీ గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రాజెక్టును నాశనం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి , రాష్ట్రానికి ఓ శాపం లాంటి వ్యక్తి గత ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా పనిచేశారని దుయ్యబట్టారు. ఆ పాలన ఓ కే స్టడీగా మిగిలిపోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వం చేసిన నిర్వాకంవల్ల ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని… డయా ప్రమ్ వాల్ నిర్మించడానికి 450 కోట్లు ఖర్చయితే, ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి 427 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని.. అయినా సరే అది పూర్తిగా రిపేర్ అవుతుందని భరోసా లేదని… మొత్తం వాల్ సమాంతరంగా కట్టాలంటే  900 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉందని వివరించారు. తాము చేపట్టిన పనులు కొనసాగించి ఉంటే 2020 నాటికే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉందని,  ప్రస్తుతం ఉన్న స్థితిలో పూర్తి కావడానికి మరో నాలుగేళ్ళు పడుతుందని… అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే సాధ్యమని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు.

డయా ఫ్రమ్ వాల్ 35 శాతం దెబ్బతిందని, గత ప్రభుత్వం దాన్ని కాపాడలేక పోయిందని, రూ.55౦ కోట్లతో 2 కాఫర్ డ్యామ్ లు నిర్మించారని… కానీ వాటి మధ్య గ్యాప్ లు పూడ్చలేదన్నారు. గతంలో తాము పోలవరంపై 13,600 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. గత ఐదేళ్లూ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని,   ప్రాజెక్టును గందరగోళం చేశారని,  ఎంత సంక్సిష్టం చేయాలో అంతా చేశారని, ఎన్నో చిక్కుముడులు వేశారని బాబు విమర్శించారు. పోలవరం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, దాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్