Sunday, January 19, 2025
Homeసినిమాఆస్కార్ అకాడమీ న్యూ మెంబర్ ఎన్టీఆర్

ఆస్కార్ అకాడమీ న్యూ మెంబర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్.. సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జపాన్ లో అప్పటి వరకు ఉన్న రికార్డులను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ఎన్టీఆర్, చరణ్ లతో బాలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు.. హాలీవుడ్ మేకర్స్ సైతం సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుండడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కు ఆస్కార్ అకాడమీలో ఊహించని గౌరవం దక్కింది. అకాడమీ యాక్టర్స్ గ్రూపు నుంచి తీసుకున్న కొత్త మెంబర్స్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉండడం విశేషం. ఇది తెలుగు హీరోలకు, తెలుగు సినిమాకు గర్వకారణం అని చెప్పచ్చు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. కొరటాల డైరెక్షన్ లో రూపొందుతోన్న దేవర సినిమా ఏప్రిల్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

దేవర తర్వాత ఎన్టీఆర్.. వార్ 2 మూవీ చేయనున్నారు. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటించే ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. వార్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ దేవర 2, ప్రశాంత్ నీల్ తో సినిమాలను చేయనున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్