అనంతపురం జిల్లలో విషాదం చోటు చేసుకుంది. సింగనమల సమీపంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయ పూజారి అప్పా పాపయ్య దుర్మరణం పాలయారు. కొండ చివర భాగాన నిలబడి స్వామి వారికి పూజారి పాపయ్య ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. సంప్రదాయ వాయిద్యాల శబ్దాల నడుమ పూజారి నృత్యం చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు పూజారి కాలుజారి కొండపై నుంచి దొర్లుతూ వెయ్యి అడుగుల కిందకు లోయలో పడిపోయారు.
కొండపైన ఉన్న భక్తులందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగింది. వెంటనే భక్తులు కొండ కిందకు వెళ్లి చూశారు.. కానీ అప్పటికే పూజారి పాపయ్య చనిపోయారు. భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసంప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలయ పూజారి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.