Saturday, January 18, 2025
Homeసినిమా‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్

‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్

ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘సలార్’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నుంచి నిర్మాత విజ‌య్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సలార్ సినిమాలో ఆయ‌న చేస్తున్న వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్‌, ఓరా అంద‌రికీ తెలిసిందే. అలాంటి ఓ స్టార్ యాక్ట‌ర్‌ సలార్ సినిమాలో న‌టిస్తుండ‌టం సినిమాపై  ప్రభావం చూపుతుంది.

పృథ్వీరాజ్ పాత్ర గురించి  ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ… ‘మలయాళంలో సూపర్‌స్టార్ అయిన పృథ్వీరాజ్ గారు మా సలార్ సినిమాలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ పాత్ర‌లో ఆయ‌న కంటే గొప్ప‌గా మ‌రెవ‌రూ సూట్ కారు. ఆయ‌న ఆ పాత్ర‌ను పోషించిన తీరు అద్భుతం. త‌న గొప్ప న‌ట‌న‌తో పాత్ర‌కు న్యాయం చేశారు. ఆయ‌న ఈ సినిమాలో నటించడం వల్ల డ్రామా నెక్ట్స్ రేంజ్‌లో ఆడియెన్స్‌కి కిక్కేంచేలా ఉంటుంది. మలయాళ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఉన్న ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పృథ్వీరాజ్, ప్రభాస్ లాంటి ఇద్దరు గొప్ప నటులను డైరెక్ట్ చేయ‌టం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌” అన్నారు. ఈ  స‌లార్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్