Sunday, January 19, 2025
HomeTrending NewsPonds Development: మురుగు నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ - కేటిఆర్

Ponds Development: మురుగు నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ – కేటిఆర్

హైదరాబాద్ ప‌రిధిలోని చెరువుల‌న్నింటినీ అన్ని ర‌కాల వ‌స‌తుల‌తో అభివృద్ధి చేస్తున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కుటుంబ స‌మేతంగా సేద తీర‌డానికి అనువుగా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 25, హెచ్‌ఎండీఏ పరిధిలోని 25 – మొత్తం 50 చెరువులను అభివృద్ధి లక్ష్యంగా ”చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని” మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తాను ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నాని, ఇంటర్ క్లాస్మేట్ హైదరాబాద్ కెనెడా కంటే బాగా ఉంది అని అన్నారని చెప్పారు.

కేటిఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

నేను లేనిపోని కామెంట్స్ చేయను. గుంటూరు బాగనే ఉంది…వైజాగ్ బగనే ఉంది…విజయవాడ బాగనే ఉంది…అన్ని బాగున్నాయి…నేను వాటి గురించి మాట్లాడను. కట్టు కథలు, పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావు. వాక్సిన్ నగరంగా హైదరాబాద్ ఉంది. వచ్చే సంవత్సరం వరకు1400 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. ఫాక్స్ కాన్ వల్ల 30 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఫెడ్ ఎక్స్ ఒక్క సంస్థ ఏడు వేల ఉద్యోగాలు సృష్టించింది. గతేడాది లక్ష 50 వేల ఉద్యోగాలు సంవత్సరంలో వచ్చాయి. 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లు కాగా 2030 వరకు 250బిలియన్ డాలర్లు అనుకుంటున్నాము. ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది.

31 కి.మి విమానాశ్రయ మెట్రోను మూడేండ్లలో పూర్తి చేస్తాము. పటాన్ చెరువు నుండి లకడికాపూల్, నాగోల్ నుండి ఎల్ బి నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలి అని కేంద్రాన్ని కోరితే అది అంత ఫిసబుల్ కాదు అని సమాచారం వచ్చింది. వారు సహకరించిన , సహకరించకపోయిన మెట్రొను విస్తరిస్తాము. ఉత్తరప్రదేశ్ లో పది నగరాల్లో మెట్రో నిర్మిస్తున్న వారికి డబ్బులు ఇస్తారు. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరు. మన పన్నులు తీసుకుని ఇతర నగరాల అబివృద్దికి ఇస్తున్నారు, మరి మనకు ఎందుకు ఇవ్వరు. వివక్ష చూపితే బాధ అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగర అబివృద్దికి సహకరించండి. ఫార్మా సిటీ వస్తుంది. ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది.

కోవిడ్ వలన ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం నష్టం వచ్చింది. నగరానికి 250 కి.మి మెట్రో తప్పకుండా ఉండాలి. 500 ఎలక్ట్రికల్ బస్ లను తెస్తున్నాము. మూసి పై 14 బ్రీడ్జ్ లను పది వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. రాచకొండ వద్ద ఒలంపిక్ స్థాయి సినిమా సిటీ కావాలి. చెరువుల అభివృద్ధిని నామమాత్రంగా చేయకండి. డబ్బాలాగా బిల్డింగ్ లను కట్టకండి, మంచి అర్కిటెక్చర్ తో బ్రహ్మాండంగా కట్టండి. జూలై చివరి వరకు దేశంలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధి గల నగరంగా హైదరాబాద్ అవుతుంది. ప్రైవేట్ ఎస్ టి పి లను నిర్మించాలి. చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్, టాయిలెట్స్, లైటింగ్, పిల్లలు ఆట స్థలాలు, సామాజిక కార్యక్రమాలకు వాడుకోవాలి అనుకుంటే అంఫి థియేటర్ ఉండాలి. జిల్లా కేంద్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరికరణను చేస్తున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు.

Also Read : Metro Rail: నాగోల్‌ టు ఎల్బీనగర్‌ పూర్తి చేస్తాం – కేటిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్