బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ క్రేజీ కాంబో అనౌన్స్ మెంట్ ఉంటుందని.. ఇది పొలిటికల్ మూవీ అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ,ఇటు ఇండస్ట్రీలోనూ మరింత ఆసక్తి ఏర్పడింది.
జూన్ 10న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి 2024 ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేయాలనేది ప్లాన్ అని సమాచారం. అయితే.. బాలయ్య, బోయపాటి కలిసి చేసిన మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించడతో నాలుగువ సినిమాను నిర్మించేందుకు నిర్మాతల మధ్య ఏర్పడిందని తెలిసింది. దీంతో ఈ సినిమాను ఏ బ్యానర్ లో చేయాలి అనేది ప్రశ్నగా మారిందట. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో బోయపాటి ఓ సినిమా చేయాలి. ఇది ఎప్పుడో ఇచ్చిన మాట. అందుచేత తన బ్యానర్ లోనే ఈ సినిమా చేయాలని అనిల్ సుంకర పట్టుబడుతున్నారట.
మరో వైపు దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా బాలయ్యకు అడ్వాన్స్ ఇచ్చాడని టాక్. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ కూడా ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఓకే చెప్పారట. ఈ ముగ్గురు నిర్మాతలు ఈ సినిమాను మా బ్యానర్ లోనే చేసేలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందుచేత ఈ మూడు సంస్థలకు కలిపి ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు నిర్మాతలను కలిపి సినిమా చేయడం కష్టం అనుకుంటే.. ఇద్దరు నిర్మాతలను కలిపైనా సరే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి.. ఏ ఏ బ్యానర్ లను కలిపి ఈ సినిమా చేస్తారనేది జూన్ 10న క్లారిటీ వస్తుంది.