సి ఎల్ ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ మూవీ మోషన్ పోస్టర్ ను సుప్రసిద్ధ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ముంబై ,పూణే, లోనావాలా, హైదరాబాద్ నగరాలలోని వివిధ లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరించారు.
ఇది ఒక ఫ్యాషన్ అండ్ గ్లామర్ ఇండస్ట్రీ బేస్డ్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని దర్శకుడు రవిచంద్రన్ రూపొందించారు. షఫీ ఈ చిత్రంలో షఫీ పోషించిన ఏసిపి క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుంది. కమల్ డిఫెన్స్ లాయర్ పాత్రలో జీవించారు. హీరో రమణ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్ గల పాత్రలో స్టైలిష్ గా చేశారు.
డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ… నా గురువు సి కళ్యాణ్ గారు నా మొదటి పిక్చర్ ‘పాయిజన్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. మిస్టరీస్ జోనర్లో నడుస్తుంది. మూవీ చాలా బాగా వచ్చింది అన్నారు.