Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప-2'లో విజ‌య్ సేతుప‌తి... నిజమేనా?

‘పుష్ప-2’లో విజ‌య్ సేతుప‌తి… నిజమేనా?

Is it? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌. ఈ మూవీ విడుదలై ఏడు నెలలు గడిచినా సోష‌ల్ మీడియాలో ఇంకా హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డం విశేషం. నేష‌న‌ల్ లెవ‌ల్లో మాత్ర‌మే కాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో పుష్ప ప్ర‌భావం కనబడుతోంది. అందుకే ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా పుష్ప 2 ను మ‌రింత ఆస‌క్తిగా ఉండేలా సుకుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ కోసం సుకుమార్… క‌మ‌ల్ హాస‌న్ ‘విక్ర‌మ్’ మూవీని ఫాలో కానున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మేట‌ర్ ఏంటంటే.. విక్ర‌మ్ మూవీలో మ‌ల‌యాళ స్టార్ ఫాహిద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి న‌టించారు. దీనిని ఫాలో అవుతూ ఆల్రెడీ మ‌ల‌యాళ స్టార్ ఫాహిద్ ఫాజిల్ న‌టిస్తున్నాడు కాబ‌ట్టి కోలీవుడ్ స్టార్ విజ‌య్ ను కూడా రంగంలోకి దింప‌నున్నార‌న, అయన కోసం ప‌వ‌ర్ ఫుల్ రోల్ డిజైన్ చేశార‌ని టాక్ వ‌చ్చింది.

దీనిపై ఆరా తీస్తే… అలాంటిది ఏమీ లేద‌ని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ పుష్ప 2 స్క్రిప్టు  రెడీ అయ్యింద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఆగ‌ష్టు నుంచి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంద‌ని తెలియ‌చేశారు. ఈస్ట్ గోదావ‌రి మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Also Read : బుల్లితెరపైనా పుష్ప‌ సెన్సేష‌న్

RELATED ARTICLES

Most Popular

న్యూస్