Profitable Crop నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్‌లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఇబ్బందులు లాభాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రానున్నది ఆయిల్‌ఫామ్ రోజులే అని.. వరి పంటతో పోలిస్తే ఆయిల్ ఫామ్‌తో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. అవగాహన సదస్సులతో పాటు ప్రభుత్వం అందించే సబ్సీడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచనలు చేశారు.
Also Read : టార్గెట్ ఇరవై లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి