Saturday, January 18, 2025
Homeసినిమాప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ మారిందా..?

ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ మారిందా..?

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడుగా నటిస్తే.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటించింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ఇప్పుడు సమ్మర్ కి వాయిదా వేశారని సమాచారం.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా రూపొందుతుంది. ప్రాజెక్ట్-కే సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా థియేటర్స్‌లోకి తీసుకువస్తామని గతంలో మేకర్స్ తెలిపారు.

అయితే… విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యమవుతుండటంతో మూవీ రిలీజ్ డేట్‌ను పోస్ట్‌ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం 2024 వేసవిలో విడుదల కానుందని సమాచారం. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రాజెక్ట్-కే చిత్రీకరణ పూర్తవుతుంది. మూవీ షూటింగ్ పూర్తి కాగానే టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం సమయాన్ని వెచ్చించనుంది. ఫ్యూచరిస్టిక్‌గా సినిమాగా రూపొందుతుండటంతో ప్రాజెక్ట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు దాదాపు ఏడాది పడుతుందని అంచనా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్