Sunday, January 19, 2025
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

‘ప్రాజెక్ట్ కే’ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఒక గైడ్ లా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇంత వరకు అప్ డేట్స్ బయటకు రావడం లేదు. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ను జులైలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 2024 సంక్రాంతికి ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ఇంతకు ముందు ప్రకటించారు. అయితే..  మోషన్ పోస్టర్ నుంచే ప్రమోషన్స్ లో సెపరేట్ మార్క్ సెట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకే ప్రాజెక్ట్ కే మోషన్ పోస్టర్ ఇండియాలో కాకుండా యూఎస్ లో భారీ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ ఈవెంట్ తో ప్రాజెక్ట్ కే పై వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేయాలనేది మేకర్స్ ప్లాన్.

బాహుబలి సినిమాతో విదేశాల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ చిత్రాలతో ప్రభాస్ కు విదేశాల్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ పాన్ వరల్డ్ మూవీతో ప్రభాస్ కు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మరింత క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రంతో ప్రభాస్ కూడా గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు మేకర్స్. మరి.. ఈ సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్