Wednesday, January 22, 2025
Homeసినిమాసంక్రాంతి పోటీ నుంచి ప్రాజెక్ట్ కే ఔట్?

సంక్రాంతి పోటీ నుంచి ప్రాజెక్ట్ కే ఔట్?

సంక్రాంతి వస్తుంది అంటే.. భారీ సినిమాలు క్యూ కడుతుంటాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ను వచ్చే సంక్రాంతికి  జనవరి 13న విడుదల చేస్తున్నట్లు  ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు, ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ కి షూటింగ్ పూర్తి చేయాలనేది మహేష్ టార్గెట్. ఈ లెక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఈ సినిమా రావడం పక్కా అని చెప్పచ్చు.

‘గుంటూరు కారం’ తో పాటు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ ను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రానికి బాగా ప్రమోట్ చేయాలి. అందుచేత ఎక్కువ టైమ్ కావాలి. పైగా గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా సమయం అవసరం. అందుచేత సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే డౌట్ ఉండేది. ఇటీవల సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుతూ.. తనకున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం సంక్రాంతికి కాదు.. సమ్మర్ కి వస్తుందని చెప్పారు.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందిస్తున్న హనుమాన్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిని బట్టి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నట్లే. అయితే మేకర్స్ మాత్రం  అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరో వైపు సంక్రాంతికి రవితేజ ఈగల్ సినిమా రానుంది అనౌన్స్ చేశారు. మరికొన్ని సినిమాలు సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్నాయని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్