Sunday, January 19, 2025
HomeTrending News8 ఏళ్ళుగా భూపంపిణీ చేయలేదు - భట్టి విమర్శ

8 ఏళ్ళుగా భూపంపిణీ చేయలేదు – భట్టి విమర్శ

ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 24లక్షల ఎకరాలను పంపిణీ చేయగా 12లక్షల ఎకరాలను పార్ట్-బిలో నమోదు చేసి రైతులను కెసిఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై ఈ రోజు ఖమ్మం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ధర్నాలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ధర్నాలో భట్టి విక్రమార్క కామెంట్స్

ధరణి పోర్టల్ తీసుకొచ్చి రికార్డులను నమోదు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాట్లను సైతం అధికారులు పరిష్కారం చేయకుండ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పడం ఎంత వరకు సమంజసం. భూ సేకరణ చేసిన సర్వే నెంబర్ భూమిని మొత్తాన్ని ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టడం సరికాదు. పార్టు-ఎలో అధికారులు తప్పుగా నమోదు చేసిన పట్టాదారు ఇంటి పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణం తదితర పొరపాట్లను అధికారులు సత్వరమే సరిచేయాలి. అధికారంలోకి వస్తే 3 ఎకరాలు భూమి పంపిణీ చేస్తామని వాగ్దానం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అభివృద్ది కోసమని గుంజుకోవడం ఆన్యాయం.

కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో భూ పంపిణీ జరుగలేదు. అసైన్డ్ కమిటీలు రద్దు చేసి భూ పంపిణీ గురించి 8 ఏండ్లుగా ఊసే ఎత్తని సర్కార్. ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు భూములు కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాయి. 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వడానికి భూ సేకరణ చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అభివృద్ధి పేరిట బలవంతంగా గుంజుకొని పేదలను మరింత పేదలుగా మార్చుతున్న సర్కార్. గత ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జమబంధీ నిర్వహించేవి. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జమబంధీ రికార్డుల నమోదు సక్రమంగా జరుగడం లేదు. సంక్లిష్టమైన వ్యవస్థతో రైతులను ఇబ్బంది పెడుతున్న టిఆర్ఎస్ సర్కార్.

ధరణిలో ఉన్న అవకతవకలను సరిచేసి రైతుల సమస్యలు పరిష్కారించాలి. రాష్ట్రంలో భూ పంపిణీ కార్యాక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి‌. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వాలి. ఆసైన్డ్, ఇనాం భూముల్లో కబ్జాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములకు సంబంధించిన రైతుల సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మెన్ చంద లింగయ్యదొర, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు శేఖర్, బొందయ్య, సౌజన్య, సంతోష్, వీరభద్రం, కార్యక్రమ పర్యవేక్షకులు జయప్రకాశ్, పిసిసి సభ్యులు రాందాసునాయక్, నాగేశ్వర్ రావు, వడ్డె నారయణరావు, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాయకులు బుల్లెట్ బాబు, మల్లెల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్