Friday, May 9, 2025
HomeTrending Newsతెరాస ఎంపిల నిరసన

తెరాస ఎంపిల నిరసన

 Trs Mps In Parliament :

రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీఎం కెసిఆర్ ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్ సి ఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయని, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు.

Also Read : నల్ల చట్టాల రద్దు రైతుల విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్