అంబేద్కర్ ఆశించినట్లు దళితులు, బలహీనవర్గాలు, పేదలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి వచ్చేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతోంది. ఇదే సామాజిక న్యాయమని పేర్కొన్నారు. తాను శాసనమండలి చైర్మన్‌గా ఉన్నానంటే అది సీఎం జగన్ సామాజిక సాధికారత చర్యల్లో భాగమేనని స్పష్టం చేశారు. బీసీకి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా, నందిగం సురేష్ ఎంపీగా చేసిన ఘనత కూడా జగన్ కే దక్కుతుందన్నారు. డా. అంబేద్కర్ కోరుకున్నట్టుగా సాధికారతను జగన్ అమలు చేసి చూపారని కొనియాడారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మోషేన్ రాజుతో పాటు ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో….
డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు – నేడు ద్వారా అభివృద్ధి పనలు చేస్తున్నారని, అవ్వా-తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బూడి ముత్యాల నాయుడుతో పాటు మంత్రులు మేరుగ నాగార్జున,గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.