Tuesday, March 10, 2026
Homeసినిమానితిన్ సరసన పూజా హేగ్డే

నితిన్ సరసన పూజా హేగ్డే

యువ హీరో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట మూవీస్ నిర్మించనుంది. వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత చేసే సినిమా ఇదే. ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

పూజా హేగ్డే.. అఖిల్ సరసన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం రిలీజ్’ కి రెడీ అవుతుంది. అలాగే ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ మూవీలో ‘పూజా హేగ్డే’ నటిస్తుంది. ఈ సినిమాతో పాటు నితిన్ సినిమాలో కూడా నటించేందుకు ఓకే చెప్పింది. నితిన్ తన సినిమాల్లో హీరోయిన్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. రష్మిక, కీర్తి సురేష్, పూజా హేగ్డే.. ఇలా క్రేజీ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular