Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వాస్తవాలు మాట్లాడండి : అనిల్

వాస్తవాలు మాట్లాడండి : అనిల్

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు సిఎంగా ఉండగా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పులిచింతల గేటు విరిగిన ఘటనపై టిడిపి నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అనిల్ కుమార్ ఖండించారు. లోకేష్ ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తున్నారని, ఇది సరికాదని హితవు పలికారు.

గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారని, అయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వర్షాలు కూడా పడలేదని, జగన్ సిఎం అయిన తర్వాత పుష్కలంగా వానలు పడుతున్నాయని వెల్లడించారు. 2012లో ప్రాజెక్టుకు గేట్లు పెట్టారని, చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు 2015లో పులిచింతల ప్రాజెక్టు నాణ్యతాలోపాలపై నిపుణుల బృందం నివేదిక ఇస్తే దాన్ని పక్కన పెట్టారన్నారు. ఈ విషయమై కొందరు కోర్టుకు వెళితే ప్రాజెక్టు పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేదని, కొట్టుకుపోయిన గేటు అంతకుముందు బాగానే పనిచేసిందన్నారు.

పులిచింతల గేట్ల విషయమై స్పందిస్తూ “తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు, దీనిపై అనిల్ మండిపడ్డారు. నీ యబ్బ హయాంలో ఏమి జరిగిందో నీకు తెలియదా అంటూ ఘాటుగా ప్రతిస్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్