Sunday, January 19, 2025
HomeTrending Newsఅంబెడ్కర్ విగ్రహం పెట్టె వరకు పోరాటం - విహెచ్

అంబెడ్కర్ విగ్రహం పెట్టె వరకు పోరాటం – విహెచ్

నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పెరు పెడితే బాగుంటుందని పీసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం వల్లనే అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడిన విహెచ్ అట్టడుగు వర్గాల వారికి నిజమైన స్వతంత్రం అంబెడ్కర్ వల్లే వచ్చిందన్నారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు విషయంలో మద్దతు ఇవ్వాలని..స్టాలిన్,నితీష్ కుమార్, కేజ్రీవాల్, చత్తిస్ ఘడ్ సీఎం లకు లేఖ రాశానన్నారు. పంజాగుట్టలో 2019 ఏప్రిల్ లో అంబెడ్కర్ విగ్రహాన్ని పెడదామని అక్కడికి తీసుకెళ్ళామని, మున్సిపల్ అధికారులు అక్కడి నుండి విగ్రహం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారన్నారు. మమ్మల్ని కూడా స్టేషన్ లో పెట్టారని గుర్తుచేశారు.

ఐఐటీ,ఐఐఎమ్ లలో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారంటే రాజ్యాంగ వల్లే సాధ్యమైందని వి.హనుమంతరావు గుర్తు చేశారు. సైకిల్ మోటార్లు దొంగతనం చేసిన వారిని పెట్టె లాకప్ లో అంబెడ్కర్ విగ్రహం పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో విగ్రహాలు పెట్టారు..వాటికి అనుమతులు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాగుట్టలో ఉన్న వైస్సార్ విగ్రహానికి పర్మిషన్ ఉందా…? వాటికి పర్మిషన్ ఉంటే అంబేద్కర్ విగ్రహానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని విహెచ్ డిమాండ్ చేశారు.

పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పెరు పెట్టాలని తీర్మానం చేసిన సిఎం కేసీఆర్ కి వి హనుమంత రావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం పెట్టె వరకు నా పోరాటం కొనసాగుతుందని, నా మీద కేసులు పెట్టారు..మూడేళ్ళ నుండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న అన్నారు. రాజ్యాంగంలో అంబెడ్కర్ పెట్టిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చిందని వి.హనుమంతరావు అన్నారు.

Also Read : కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్