Friday, March 28, 2025
HomeTrending NewsPurandeshwari: సజ్జల వ్యాఖ్యలకు చిన్నమ్మ కౌంటర్

Purandeshwari: సజ్జల వ్యాఖ్యలకు చిన్నమ్మ కౌంటర్

సెప్టెంబర్ 1 నుంచి 15 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ‘నా భూమి- నా దేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని,  ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. పట్టణాల్లో మట్టి ఉండదు కాబట్టి చిటికెడు బియ్యం సేకరిస్తామన్నారు. నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని, అక్టోబర్ 3-11 వరకూ రెండో దశ నిర్వహిస్తామని… చివరి దశలో దేశవ్యాప్తంగా సేకరించిన ఈ మట్టిని ఢిల్లీకి చేర్చి అక్కడ  అమృత వనాన్ని ఏర్పాటు చేస్తామని, తద్వారా దేశమంతా ఒకటే అనే భావన కలిగిస్తామని వివరించారు.  విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శంఖానాదం పేరుతో బిజెపి సోషల్ మీడియా, ఐటి వర్క్ షాప్ జరిగింది. దీనికి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

మోడీ ప్రధాని అయిన తరువాత పేదవారి కోసం ఎన్నో పథకాలు చేపట్టారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేయాలని అందుకే  ఈ ఐటి వర్క్ షాప్ కు శంఖానాదం పేరు పెట్టామని తెలిపారు.  ప్రధాని మోడీ రక్షా బంధనం కానుకగా గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ పొందిన వారికి 400 రూపాయల మేర  తగ్గించారని కొనియాడారు.  ఇది ఎన్నికల జిమ్మిక్కు కాదని, తగ్గింపుపై విపక్షాల వాదన ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అన్యమతస్తులను టిటిడి బోర్డుల్లో చేర్చడంపై నిరసన చేపట్టామని, అన్ని ఆలయాల వద్ద సంతకాల సేకరణ చేపట్టామని.. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని చెప్పారు.

ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులందరం పాల్గొన్నామని, దీన్ని రాజకీయ కోణంలో చూసి ఆయన స్థాయిని తగ్గించలేరని స్పష్టం చేశారు. దీనిపై సజ్జల చేసిన కామెంట్ పై స్పందించాల్సిన అవసరం లేదని, కానీ ఆయన రాష్ట్రపతి భవన్ కు రాజకీయ రంగు పులిమారని, రాష్ట్రపతి హోదాను కించపరుస్తూ మాట్లాడారని పురందేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్