Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ ని డైరెక్టర్ పూరి మెప్పిస్తాడా?

మెగాస్టార్ ని డైరెక్టర్ పూరి మెప్పిస్తాడా?

పూరి జగన్నాథ్ .. టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఆయన స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు స్టార్ హీరోలంతా ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. ఆడియన్స్ కూడా పూరి పేరు చూసి థియేటర్స్ కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. అలాంటి పూరికి ఆ తరువాత కాలంలో వరుసగా పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో ఆయన తనకి అందుబాటులో ఉన్న హీరోలతోనే సినిమాలు చేస్తూ వెళ్లాడు. ప్రస్తుతం ఆయన రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కి ఇది రీమేక్.

ఈ సినిమా తరువాత పూరి సినిమా ఏ హీరోతో ఉంటుంది? అనేది ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇద్దరు ముగ్గురు యుంగ్ హీరోలను ఆయన లైన్లో పెడుతున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ ఆయన సీనియర్ స్టార్ హీరోలతోనే తరువాత ప్రాజెక్టులను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఆ హీరోల జాబితాలో చిరంజీవి – నాగార్జున పేర్లు కనిపిస్తున్నాయి. గతంలోనే చిరంజీవితో పూరి ఒక సినిమా చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన అది పట్టాలెక్కలేదు.

ఆ తరువాత చిరూ – పూరి ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ అయ్యారు. ఇక ఇప్పుడు మాత్రం చిరంజీవితో ఒక సినిమా చేయవలసిందే అనే పట్టుదలతో పూరి ఉన్నట్టుగా చెబుతున్నారు. మెగాస్టార్ కి తగిన కథను రెడీ చేసుకుని, ఆయనకి వినిపించే పనిలో ఉన్నాడని అంటున్నారు. మారుతి .. హరీశ్ శంకర్ లతో సినిమాలు చేయడానికి సుముఖంగా ఉన్న చిరంజీవి, పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఆ తరువాత నాగార్జునతోను ఒక సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడని టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శివమణి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్