Saturday, March 21, 2026
Homeసినిమాపూరి జగన్నాధ్ కొత్త హీరోయిన్ నార్త్ నుంచా? సౌత్ నుంచా?

పూరి జగన్నాధ్ కొత్త హీరోయిన్ నార్త్ నుంచా? సౌత్ నుంచా?

పూరి జగన్నాధ్ హీరోయిన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఆయన సినిమాల్లో కొత్త హీరోయిన్లే కనిపిస్తుంటారు. అందులోనూ ఎక్కువగా ముంబై నుంచే దిగుమతి చేస్తుంటారు. ఆయన హీరో ఎంత పెద్ద స్టార్ అయినా! తను రాసుకున్న పాత్ర ఎప్పుడూ కొత్త ముఖాన్నే కోరుకుంటుందా?  ముంబై నుంచి కొత్త మోడల్ ని దిగుమతి చేయడం అలవాటైన పని. ఇంకా అవసరమునుకుంటే బాలీవుడ్ లో అప్పుడే లాంచ్ అయిన బ్యూటీల్ని తీసుకొస్తుంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’  లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా ఏభామని దించుతాడని? అప్పుడే  నెట్టింట చర్చమొదలైపోయింది. ఇటీవలే సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ రామ్ కి పెయిర్ ఎవరు? ఎంత మంది ? అన్నది సస్పెన్స్. ఈసారి అనవాయితీగా ముంబై నుంచే దిగుమతి  చేస్తారా?  లేక  నార్త్ ముఖాలపై ఆసక్తి చూపిస్తారా? అన్నది చూడాలి.

చిట్టి పొట్టి దుస్తుల్లో..బికినీ లో హీరోయిన్ అందాలు ఎలివేట్ చేయడంలో పూరి దిట్ట. హీరోయిన్ ఇచ్చే ఎలివేషన్ తోనే కుర్రాళ్లని థియేటర్ల వైపు మళ్లించగల సమర్దుడు. అందుకోసం హీరోయిన్ లో ప్రతీ యాంగిల్ ని తదనైన శైలిలో ఆవిష్కరించడానికి చూస్తారు. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ సరసన అంటే హీరోయిన్ కూడా అంతే ఎనర్జీగా పరుగులు పెట్టించాలి. అలాంటి భామను పట్టుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే హీరోయిన్ ని ఇంకా ఎవరన్నది ఖరారు కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular