Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ తో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న పూరి

మ‌హేష్ తో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న పూరి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన ‘పోకిరి‘, ‘బిజినెస్ మ్యాన్’ చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ యో తెలిసిందే. ఈ కాంబినేష‌న్లో మ‌రో సినిమా వ‌స్తే చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ మ‌హేష్ బాబు తోనే చేయాలనుకున్నాడు పూరి. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

అయితే.. మ‌హేష్‌, పూరి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. అందుకే ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా రాదేమో అనుకుంటున్న సమయంలో పూరి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. “గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ మూవీస్ కి సీక్వెల్స్ చేద్దాం అని నేను, మహేష్ గారు అనుకున్నాం అయితే… పరిస్థితులు, మా  ఇద్దరి కమిట్మెంట్స్ కారణంగా అది కుదరలేద”న్నారు.

తనకు పండుగాడు, సూర్య భాయ్ రెండు క్యారెక్టర్స్ అంటే ఎంతో ఇష్టమని అందుకే అన్ని కలిసి వస్తే తప్పకుండా పోకిరి, బిజినెస్ మ్యాన్ మూవీస్ రెండిటికీ త్వరలో సీక్వెల్స్ మహేష్ తోనే చేసే ఆలోచన కూడా ఉందన్నారు పూరి. అయితే అవి ఎప్పుడు జరుగుతాయి అనేది చెప్పడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్