Thursday, October 3, 2024
Homeసినిమాపుష్ప‌కి ఇన్ స్పిరేష‌న్ ఎవ‌రో చెప్పిన సుక్కు

పుష్ప‌కి ఇన్ స్పిరేష‌న్ ఎవ‌రో చెప్పిన సుక్కు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ రూపొందించిన విష‌యం తెలిసిందే. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బ్లాక్ బ‌స్టర్ అవ్వ‌డం విశేషం. బాలీవుడ్ లో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి పుష్ప సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ మూవీలోని అల్లు అర్జున్ తగ్గేదేలే.. మ్యానరిజం మాత్రం ఎల్లలు లేకుండా హిట్ అయ్యింది. మరి ఈ మ్యానరిజం గురించి దర్శకుడు సుకుమార్ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.

ఇంత‌కీ ఏం చెప్పారంటే.. లేటెస్ట్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ తో సుకుమార్.. లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్ వ్యూ చేశారు. ఈ ఇంట‌ర్ వ్యూలో.. పూరి తన సినిమాల్లో చాలా మంది హీరోస్ కి ఒక కొత్త మ్యానరిజం పెట్టి ఇప్పటికీ కూడా ట్రెండ్ సెట్ చేస్తుంటార‌ని సుకుమార్ తెలిపారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసే మ్యానరిజంకి కూడా పూరి జగన్నాథ్ నే ఇన్స్పిరేషన్ ని సుకుమార్ అసలు విషయం బ‌య‌ట‌పెట్టారు.

దీనితో ఈ ఐకానిక్ అంశం పై ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయట పడింది. ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎన్ని అంచ‌నాలు పెట్టుకున్న‌ప్ప‌టికీ పుష్ప 2 ఓ రేంజ్ లో ఉంటుంద‌ని.. మ‌రోసారి పుష్ప సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. మ‌రి.. పుష్ప 2 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : పూరి కిక్ బాక్సాఫీస్ బద్దలుకొడుతుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్