Sunday, January 19, 2025
Homeసినిమావిజ‌య్, పూరి సోషియో ఫాంట‌సీ మూవీ చేస్తున్నారా?

విజ‌య్, పూరి సోషియో ఫాంట‌సీ మూవీ చేస్తున్నారా?

Combo-3?: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో లైగ‌ర్ మూవీ రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఆగ‌ష్టు 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు. ఈ సినిమా విడుద‌ల కాకుండానే.. విజ‌య్, పూరి క‌లిసి జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవ‌ల స్టార్ట్ చేశారు.

ఇందులో విజ‌య్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇదిలా ఉంటే… విజ‌య్, పూరి క‌లిసి ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా కూడా చేయ‌బోతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఇప్ప‌టి వ‌రకు చేసిన సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా చేయాలనుకుంటున్నార‌ట‌ పూరీ జగన్నాథ్.

అందుక‌నే ఈసారి సోసియో ఫాంట‌సీ మూవీ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, య‌మ‌దొంగ సినిమాల త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ట‌. పూరి ఆ త‌ర‌హాలో సోషియో ఫాంట‌సీ మూవీ చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్. దీంతో అస‌లు క‌థ ఏంటి..? ఎలా ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ ప్రాజెక్ట్ ను భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. లైగ‌ర్, జ‌న‌గ‌ణ‌మ‌న‌, సోషియో ఫాంట‌సీ మూవీతో విజయ్, పూరి బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.

Also Read : ట్రైల‌ర్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేసిన లైగ‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్