Sunday, January 19, 2025
Homeసినిమా బాలీవుడ్ హీరోతో పూరి జనగణమన..?

 బాలీవుడ్ హీరోతో పూరి జనగణమన..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన‘. ఈ చిత్రాన్ని పూరి.. మహేష్ బాబుతో చేయాలి అనుకున్నారు. సెట్ కాలేదు. తర్వాత కన్నడ స్టార్ యశ్, వెంకటేష్, పవన్ కళ్యాణ్.. ఇలా కొంత మంది అనుకున్న తర్వాత విజయ్ దేవరకొండతో సెట్ అయ్యింది. ‘లైగర్’ సినిమా రిలీజ్ అవ్వక ముందే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘జనగణమన’ అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇందులో విజయ్ సరసన పూజా హేగ్డేని ఎంపిక చేశారు. ఆమె పై కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించారు.

పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్ల పై  చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీనికి ఛార్మి కౌర్, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు. ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసారు. అయితే లైగర్ ప్లాప్ తో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. జేజీఎమ్ ఆగిపోయిన నేపథ్యంలో పూరి జగన్నాథ్ కు హీరో దొరకడం లేదని.. లైగర ఫెయిల్యూర్ తో టెన్షన్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం జనగణమన సినిమా ఆగిపోలేదని తెలుస్తోంది.

కాకపోతే విజయ్ దేవరకొండతో కాకుండా మరో హీరోతో చేయడానికి పూరి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేసుకున్న పూరి. బాలీవుడ్ హీరోలతో టచ్ లో ఉన్నాడు. రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి హీరోలతో సినిమా చేసే ఆలోచనలో వున్నాడని టాక్. దీని కోసం మళ్ళీ ముంబైలోనే మకాం వేశారని తెలిసింది. జనగణమన పనుల అక్కడి నుంచే జరుగుతాయని అంటున్నారు. బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ జనగణమన చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారట. మరి.. ఫైనల్ గా జనగణమన ఎవరితో సెట్ అవుతుందో అనేది ఆసక్తిగా మారింది.

Also Read ‘జనగణమన’ తర్వాత పూరి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్