Thursday, March 19, 2026
Homeసినిమాఇంతకీ పూరి 'జ‌న‌గ‌ణ‌మ‌న' ఎవరితో?

ఇంతకీ పూరి ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ ఎవరితో?

Puri Plans: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’. ఈ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాలి అనుకున్నారు. గ‌తంలో ఈ ప్రాజెక్ట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయితే… కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ వార్త‌ల‌కే ప‌రిమితం అయ్యింది కానీ.. సెట్స్ పైకి వెళ్ల‌లేదు. మ‌హేష్ బాబుతో కుద‌ర‌క‌పోవ‌డంతో వేరే హీరోతో చేయాల‌ని పూరి ఫిక్స్ అయ్యారు. వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్, యాశ్ పేర్లు తెరపైకి వ‌చ్చాయి. కానీ.. సెట్ కాలేదు.

ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వార్త ఏంటంటే.. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ మూవీ తెర‌కెక్కిస్తున్న పూరి ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ చిత్రాన్ని కూడా విజ‌య్ తోనే చేసేందుకు ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. అయితే… లైగర్ మూవీ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ లాంటి మహామహులతో పాన్‌ ఇండియా లెవల్లో జనగణమన ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇటు టాలీవుడ్ లోను, అటు బాలీవుడ్ లోను ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

దీంతో పూరి జ‌న‌గ‌ణ‌మ‌న టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనా?  లేక బాలీవుడ్ హీరోలు అమితాబ్, అజ‌య్ దేవ‌గ‌న్ ల‌తోనా?  అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. త్వ‌ర‌లోనే పూరి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular